Sunday, March 7, 2010


"Woman too has a body; it needs exercise. She has a brain; it needs knowledge. She has a heart; it needs experience"

Thanks for all the women, who have been a part of my life and supports me as a mother, sister, wife, daughter and as my friend. Being a woman is the greatest achievement one can have on the earth. I owe you all..

HaPPy WomEn's DaY ...

Friday, February 19, 2010


వినీలాకాశపు అంచుల్లోంచి అలా తొంగి తొంగి చూస్తున్నావు..
నీలి
సంద్రపు లోతుల్లో నా హృదయపు జాడలు గుర్తించావా ప్రియతమా..??

Thursday, February 18, 2010


నిశ్శబ్ధ రాగాల మౌన ప్రపంచంలో
నువ్వూ
- నేను కొత్త సంగీతం ...!!!

Sunday, February 14, 2010

అంకితం ..


మేఘం కరగట్లేదు... వర్షం కురవట్లేదు..,
నీ ఆలొచనల మద్య నేనింకా తడుస్తూనే ఉన్నా..!
అలల ప్రవాహంలో కన్నీరు కలుస్తూందే కానీ,
కలల ప్రవహం నుంచి కనులముందు సాక్షాత్కరించవూ..!!
నీవులెని సాయంత్రాలు-

మకరందాలూ, పరిమళాలూ వుండవు

అవశేషాలు తప్ప.

ఇపుడు మనసొక ప్లాస్టిక్ పూలతొట.


ఎవరికి తెలుసు? అంతఃసంఘర్షణలు..

నిన్నొక్కసారి కొల్పోడానికి
నన్ను నేనెన్నిసార్లు కోల్పోతున్నానో..!!
ఇపుడు క్షణమొక యుగం,
ప్రతి క్షణం లొ వివిధ 'నీవు ' లు.
మనిద్దరం కాలంతొపాటు ప్రయాణిస్తున్నాం..
ఒక క్షణం నుంచి మరో క్షణానికి,

ఒక జీవితం నుంచి మరో జీవితానికి.


అలా ఎంత కాలం గడిచిందో తెలీదు-..
.
నా దేహం నీ ఒళ్ళొ కలగంటూ నిద్రిస్తూంది.
నీ ఒళ్ళో నా స్వప్నాల మధ్య నీవున్నావు..!
ఇపుడు రెందు జీవితాలు
ప్రేమలో చిక్కుకున్నాయి
ఒక హ్రుదయంలో మరొకటి..
ఇక దాచుకోడానికి ఏమీలేదు..

పంచుకోడానికి ప్రేమ తప్ప..

జ్ఞాపకం..


ఇది నా చెలి జ్ఞాపకం....
ఒక్కోసారి ఒక్కోలా కవ్వించే నా చెలి గుర్తు జ్ఞాపకం..

నా రాకకోసం కోసం ఇన్నాళ్లుగా వేచిసుస్తున్న పదహారణాల పిచ్చిప్రేమ జ్ఞాపకం ,.
నీతో గడిపిన ఒక్కో క్షణం..ఒక్కో మధుర ఘట్టం..!!

నీతో గడిపినా ఆ సాయంత్రాలన్నీ ఇలాగే ఘనీభవించాలి..
ఆ ఆనందం దోసిళ్ళతో వొంపుకోవాలి .

ప్రియతమా..ఎక్కడున్నా..ఏం చేస్తున్నా నీ ఆలోచనల మధ్య నలుగుతూన్న
నా మనసు నుండి జాలువారిన ప్రేమ కావ్యం ఇది...!!

స్వీకరించు.....










ఎదురు చూపులు



మేఘం కరగట్లేదు..

వర్షం కురియట్లేదు..


నీ ఆలోచనల మధ్య


నేనింకా తడుస్తూనే ఉన్నా....!!!

Saturday, February 13, 2010




అంతర్గత విస్పోటనాల మధ్య
ఆలొచనలు చిద్రమవుతున్నాయి..
నా ప్రతి మౌనం లొనూ నీ సరాగాలే..

నీ నవ్వుల్లో ఇంకెన్ని సంద్రాల్ని వెదకాలో..!!

ఓ చిన్న విరామం కావాలి..
నన్ను కొంచం ఊపిరి తీసుకోనివ్వు..

ఒకే తీరం..రెందు అలలు.
సముద్రపు ఘోష ఇప్పుడిపుడె అర్థమవుతోంది..

భూమే కాదు...మనసూ గుండ్రమే ..
నీతో ప్రారంభమై, నీతొనే అంతమవుతోంది..

ఇక ప్రతీ ఉదయం..ప్రతి సంధ్యా..
నా తొలి కిరణం నీవౌతావు..

ఇలా నీతొ ఇంకెన్ని ఉషోదయాల్ని పంచుకుంటానో తెలీదు..

మౌనంగా ఓ శకం ముగుస్తుంది.. !!!

శిశిరం


నీలాల కురుల వెనుక దాగిన అందమో ..

నీలి కన్నుల్లొ మెరిసిన ఆనందమో..?

ఏ హ్రుదయంతో ఆటలాడెనో.., ఎవరికి తెలుసు..?

నీకేం..!!

మబ్బుల మేఘంలాగా ఓ చిర్నవ్వు విసిరి వెళ్ళిపోతావు..
గాయపడ్డ హ్రుదయాన్నడుగు.. శిశిరం అంటే ఎమిటో..!!!

చిన్నారి మొగ్గలు


పువ్వులంకాదే, ఇంకా మొగ్గలం మనం..!

పువ్వులంకాదే, ఇంకా మొగ్గలం మనం.,
విచ్చుకునేదాకా విచక్షణ ఎరుగని విద్యార్థులం.

ఆశయాల సాధనలో అనునిత్యం పోరాడే యోధులం.
ఆకాశానికి నిచ్చెన వేసె నవతరం వ్యోమగాములం..

భావితరాలకు స్ఫూర్తిగా నిలిచె వెలుగు దివ్వెలం.
ఓ సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన బుల్లి నావికులం..

కానీ...
పువ్వులం కాదే, ఇంకా మొగ్గలం మనం..!!

హైకూ..


ఎడారిలో
ఒంటరిగా నేను.

ఒయాసిస్సులా నీవు.!!

హైకూ..




సాయం, సంధ్య..
మనలాగే
చాలా అన్యోన్యంగా..!!

వర్షం..




మేఘాలు
వర్షిస్తున్నాయి.

గుండెబరువు దిగిపోయినట్లుగా..!!!


చెలీ..,

ప్రక్రుతిలోని అందాన్నంతా దాచుకొని,
అప్పుడప్పుడూ
కొసమెరుపులా ఓ వాలు చూపు జారుస్తావే..,
మంచు మేఘం వర్షించినట్టు.

ప్రతీ జల్లులో నీ చిరునవ్వే..!!
నీ ముంగురుల్ని తడిపే చినుకులదేం భాగ్యం..!!

స్వప్నాల్లో నిను చెరే నా ఊహలదేం భాగ్యం..!!

ముత్యాలహారం విడి వడి ఎగిసిపడే ముత్యాల్లా.....నీ ఞాపకాలు
తీరంలో అలల్లా కొట్టుమిట్టాదుతున్నా,
నేనింకా నీ దరిచెరలెకున్నా.

పంచభూతాల్లొ నీ ఉనికిని వెదికేందుకు
నాలోని ఆశలు ప్రాణవాయువుల్లో కలుస్తున్నాయి..

అయినా

నీవూ...

ఓ ఆకాశమే ప్రియతమా..!!!

Sunday, February 7, 2010

ఆకాశం నా సరిహద్దు..!!!



ఆలోచనలకు రెక్కలోస్తే.,
ఊహలు తూనీగాలవుతాయట...
వెతకగలిగితే...,
మేఘాల మధ్య పొరల్లో ఇంకెన్ని ఇంద్రధనస్సులో..

నడవగాలిగితేనే నెట్ వర్క్.
తెలిపోయేవాతిని చుంబించేదెలా...??
ఇపుడు హృదయం లో శ్యూన్యాన్ని నింపుకోవాలి..
శ్యూన్యాలు కలిసేచోట ఆకాశాన్ని వెదకాలి..

ఇక్కడ ఎగరగలిగితే

ఆకాశం నా సరిహద్దు...
ఆ ఆనందమే నాకు ముద్దు..:)

నీ నయనాలు..


అవి
..........నిర్విఘ్న తేజో వలయాలు..
అవి
..........శీతల వాసంత సమీరాలు
అవి

..........ప్రేమామృత సెలయేటి పరవళ్ళు
అవి

.
.........సువిశాల నీలి గగనాలు
అవి
..........నా పుడమి తల్లి మట్టి వాసనలు
అవి
ప్రకృతి పంచ భూతాలు....నీ నయనాలు..!!!

Sunday, January 31, 2010



మేఘాలు ముక్కలవనీ ..
నీటి చుక్కలవనీ...,
ధరిత్రిని తడిపి ముద్దగా చేయనీ...

నాకేం !
ఆకాశం అంచులు వాడిపోకుంటే
అంతే చాలు..!!

ప్రేమాలజీ...!!!


మౌనంలోంచి ప్రజ్వరిల్లే కంఠాగ్ని
నా రుధిరంలో కలిసినప్పుడే అనుకున్నా...,
నే పలికే తుది పలుకు నీవౌతావని.

నీ మౌనం ముసుగుపొరల్లో ఎముందో ఎవరికి తెలుసు..??

నిశ్సబ్ధపు పహారా నుండి తప్పించుకున్న నా మది ఊసులు
నీ హ్రుదయం చుట్టూ గస్తీ తిరుగుతున్నాయి..

ఆకాశంలో అక్షరజ్ఞానం ఎప్పుడు మొదలైందో గానీ..
ప్రతిచొటా నీ పేరే దర్శనమిస్తోంది..

అవును.
నీ జ్ఞాపకాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
నిసీధి నీడల్లొ వెంటాడిన నీ అనుభూతులు
ఇంకా నా మదిలొతుల్ని స్ప్రుశిస్తూనే ఉన్నాయి.


నా ప్రతీ నిశ్శబ్ధం ఇపుడు నీ అలొచనలమధ్యే
నలుగుతోంది..
ఇపుడు కాలం వేదమయమైపొయింది..

గవాక్షాల ఊచల్లొంచి ఎంతకాలం అలా తొంగిచూస్తావు..
నమ్మకాల్ని ఆధారం చేసుకొని నాలుగడుగులు వెయ్యొచ్చుగా..

అయినా,
నిశీధి నీడల్ని ఎప్పుడు తనివితీరా చూశావుగనుక
నన్నర్థం చెసుకొడానికి.
నీ మౌనం నన్ను దహిస్తూందని తెలీదూ..??

అంతకంతకూ పెరిగిపోతున్న ఆవేదనలమధ్య
చివరకు నేనో మ్రుతసముద్రమవుతున్నాను..

అవును..
ఇపుడు నేనొక నిషిద్ధ ప్రేమాలజీ....!!

నీ నిశ్శబ్ధం..





నాపై నిశ్శబ్ధాల వలవేయ ప్రయత్నించకు.

తప్పించుకోనూలేను .....
వొదిగి
ఉండనూలేను...

నీ
శబ్ధాలతో స్నేహం చేయడం తప్ప...!!!

Friday, January 29, 2010


శ్రీశ్రీ కి 'మహాప్రస్థానం' లా, ఠాగూర్ కి 'గీతాంజలి' లా, మణిరత్నం కి 'రోజా' లా నాకు ఇది ప్రాణం..ఒకింత గర్వం కూడా....

నిశ్శబ్ధ తరంగాల్లా కదిలిపోయే ఆలోచనలు

సరికొత్త అధ్యాయానికి ప్రతీకలు.


కాలం పునాదులపై భవిష్యత్తు నిర్మాణం

పునర్నిర్మింపబడుతోంది.

నిర్మాణకర్తవూ నీవే...

నిర్దేశకుడివీ నీవే...


అనుభవాల గోడలతో

ఆకాశహర్మ్యం పూర్తవుతోంది..

ఆశలూ , ఆశయాలూ కలగలిపిన

అద్భుత శిల్పం....అచ్చం నీలాగే.


మనసుల్ని జయించే

మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటోంది...

తుఫాను వేగాలతొ ఎగిసిపడాలే గానీ,

తీరం తలవంచదా అన్నట్లు.


ఇపుడు మంచు తెరలను ఎదిరించే

ఉషాకిరణాలు విచ్చుకోవాలి....

మళ్ళీ కొత్త సంగమం జరగాలి.

పాతవాసనలు లేని నవీన శకం ఆవిర్భవించాలి..


ఇక గమ్యస్థానాల వెదుకులాటలొ నిశీధిని లెక్కచేయక..

ఎటోవొకవైపు అడుగుపడనీ......అడుగులోనే ఆకాశం కనపడనీ......!!!

Thursday, January 28, 2010


ఒక చిన్న హైకూ...!!!

నిశ్శబ్ధం..

నీకూ, నాకూ మధ్య

సముద్రం..!!!