Sunday, January 31, 2010



మేఘాలు ముక్కలవనీ ..
నీటి చుక్కలవనీ...,
ధరిత్రిని తడిపి ముద్దగా చేయనీ...

నాకేం !
ఆకాశం అంచులు వాడిపోకుంటే
అంతే చాలు..!!

ప్రేమాలజీ...!!!


మౌనంలోంచి ప్రజ్వరిల్లే కంఠాగ్ని
నా రుధిరంలో కలిసినప్పుడే అనుకున్నా...,
నే పలికే తుది పలుకు నీవౌతావని.

నీ మౌనం ముసుగుపొరల్లో ఎముందో ఎవరికి తెలుసు..??

నిశ్సబ్ధపు పహారా నుండి తప్పించుకున్న నా మది ఊసులు
నీ హ్రుదయం చుట్టూ గస్తీ తిరుగుతున్నాయి..

ఆకాశంలో అక్షరజ్ఞానం ఎప్పుడు మొదలైందో గానీ..
ప్రతిచొటా నీ పేరే దర్శనమిస్తోంది..

అవును.
నీ జ్ఞాపకాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
నిసీధి నీడల్లొ వెంటాడిన నీ అనుభూతులు
ఇంకా నా మదిలొతుల్ని స్ప్రుశిస్తూనే ఉన్నాయి.


నా ప్రతీ నిశ్శబ్ధం ఇపుడు నీ అలొచనలమధ్యే
నలుగుతోంది..
ఇపుడు కాలం వేదమయమైపొయింది..

గవాక్షాల ఊచల్లొంచి ఎంతకాలం అలా తొంగిచూస్తావు..
నమ్మకాల్ని ఆధారం చేసుకొని నాలుగడుగులు వెయ్యొచ్చుగా..

అయినా,
నిశీధి నీడల్ని ఎప్పుడు తనివితీరా చూశావుగనుక
నన్నర్థం చెసుకొడానికి.
నీ మౌనం నన్ను దహిస్తూందని తెలీదూ..??

అంతకంతకూ పెరిగిపోతున్న ఆవేదనలమధ్య
చివరకు నేనో మ్రుతసముద్రమవుతున్నాను..

అవును..
ఇపుడు నేనొక నిషిద్ధ ప్రేమాలజీ....!!

నీ నిశ్శబ్ధం..





నాపై నిశ్శబ్ధాల వలవేయ ప్రయత్నించకు.

తప్పించుకోనూలేను .....
వొదిగి
ఉండనూలేను...

నీ
శబ్ధాలతో స్నేహం చేయడం తప్ప...!!!

Friday, January 29, 2010


శ్రీశ్రీ కి 'మహాప్రస్థానం' లా, ఠాగూర్ కి 'గీతాంజలి' లా, మణిరత్నం కి 'రోజా' లా నాకు ఇది ప్రాణం..ఒకింత గర్వం కూడా....

నిశ్శబ్ధ తరంగాల్లా కదిలిపోయే ఆలోచనలు

సరికొత్త అధ్యాయానికి ప్రతీకలు.


కాలం పునాదులపై భవిష్యత్తు నిర్మాణం

పునర్నిర్మింపబడుతోంది.

నిర్మాణకర్తవూ నీవే...

నిర్దేశకుడివీ నీవే...


అనుభవాల గోడలతో

ఆకాశహర్మ్యం పూర్తవుతోంది..

ఆశలూ , ఆశయాలూ కలగలిపిన

అద్భుత శిల్పం....అచ్చం నీలాగే.


మనసుల్ని జయించే

మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటోంది...

తుఫాను వేగాలతొ ఎగిసిపడాలే గానీ,

తీరం తలవంచదా అన్నట్లు.


ఇపుడు మంచు తెరలను ఎదిరించే

ఉషాకిరణాలు విచ్చుకోవాలి....

మళ్ళీ కొత్త సంగమం జరగాలి.

పాతవాసనలు లేని నవీన శకం ఆవిర్భవించాలి..


ఇక గమ్యస్థానాల వెదుకులాటలొ నిశీధిని లెక్కచేయక..

ఎటోవొకవైపు అడుగుపడనీ......అడుగులోనే ఆకాశం కనపడనీ......!!!

Thursday, January 28, 2010


ఒక చిన్న హైకూ...!!!

నిశ్శబ్ధం..

నీకూ, నాకూ మధ్య

సముద్రం..!!!