Friday, January 29, 2010


శ్రీశ్రీ కి 'మహాప్రస్థానం' లా, ఠాగూర్ కి 'గీతాంజలి' లా, మణిరత్నం కి 'రోజా' లా నాకు ఇది ప్రాణం..ఒకింత గర్వం కూడా....

నిశ్శబ్ధ తరంగాల్లా కదిలిపోయే ఆలోచనలు

సరికొత్త అధ్యాయానికి ప్రతీకలు.


కాలం పునాదులపై భవిష్యత్తు నిర్మాణం

పునర్నిర్మింపబడుతోంది.

నిర్మాణకర్తవూ నీవే...

నిర్దేశకుడివీ నీవే...


అనుభవాల గోడలతో

ఆకాశహర్మ్యం పూర్తవుతోంది..

ఆశలూ , ఆశయాలూ కలగలిపిన

అద్భుత శిల్పం....అచ్చం నీలాగే.


మనసుల్ని జయించే

మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటోంది...

తుఫాను వేగాలతొ ఎగిసిపడాలే గానీ,

తీరం తలవంచదా అన్నట్లు.


ఇపుడు మంచు తెరలను ఎదిరించే

ఉషాకిరణాలు విచ్చుకోవాలి....

మళ్ళీ కొత్త సంగమం జరగాలి.

పాతవాసనలు లేని నవీన శకం ఆవిర్భవించాలి..


ఇక గమ్యస్థానాల వెదుకులాటలొ నిశీధిని లెక్కచేయక..

ఎటోవొకవైపు అడుగుపడనీ......అడుగులోనే ఆకాశం కనపడనీ......!!!

No comments: