Friday, July 15, 2011



ఎంతకాలమని ఏడుస్తాం?
రావణకాష్టంలా రగులుతున్న భారతిని చూసి
రక్తసిక్తమై పడివున్న సోదరుల్ని చూసి
ఇంకెంతకాలం సహిస్తాం..?
ఇది కష్టమో, నష్టమో, ఆ పైవాడికి మనపై అయిష్టమో
శాపమా, పాపమా లేక చేతకాని మన అవిటితనమా .?
ఒంట్లో ఉన్నది చీమూ నెత్తురేనా ? ప్రవహిస్తున్నదంతా మతపు మత్తుమందేనా..?
ఆవేశం తప్ప ఆలొచన లేదా..? మతం తప్ప మానవత్వం లేదా..?
దావానలంలా వ్యాపిస్తున్న ఈ రాక్షస క్రీడకి అంతం లేదా..?

మారణ హొమంతో ఇంకెన్నాళ్ళు మేల్కొంటాం..?
రక్తపు మరకలపై ఇంకెంత కాలం నడుస్తాం..?

ఆత్మశోధనతో, అంతుబట్టని అరణ్యకాండకి అంతం పలకాలి.
మాకో కొత్త శరీరం కావాలి..

కులమతాల రంగులు లేని, అధికార దాహం లేని
ధనమంటే మక్కువలేని దేహం...
ప్రాణాలు తప్ప విశ్వాసాలు సజీవమంటూ
సౌభ్రాత్రుత్వపు విలువలు చావలేదంటూ,
కర్తవ్య నిర్వహణ మరువలెని దేహం..

రొమ్ముచూపే దమ్ములున్న దేహం, మనిషిని మనిషిగా చూసే దేహం.

మాకొ కొత్త శరీరం కావలి...
మమ్మల్ని మళ్ళీ పుట్టించు.. .ఇప్పుడైనా ఒక మానవ ప్రపంచంలో ...!!

No comments: